businessteam

ఒకే దేశం…. ఒకే ఎన్నిక …పొందుతుందా మన్నిక ?
One NATION, One ELECTION

జమిలి ఎన్నికల పై చర్చ మరో సారి తెర పైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల పై కమిటీ ని నియమించటం , సెప్టెంబర్ 18 న ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాలు నిర్వహించడం మరియు అజెండా పై కేంద్రం వ్యూహాత్మక మౌనం పాటించటం తో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ఏమిటి ఈ జమిలి …

పార్లమెంటు లోని 543 ఎమ్.పి సీట్లకు, 4120 ఎమ్.ఎల్.యే సీట్లకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించడాన్ని జమిలి ఎన్నికలు అంటారు. స్వాతంత్ర్యానంనతరం 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికలే జరిగేవి. కాని అటు కేంద్రంలో ను ఇటు వివిధ రాష్ట్రాల లోను ప్రభుత్వాలు మధ్య లో పడి పోవడంతో జమిలి ఎన్నికలకు బ్రేక్ పడింది. దీంతో ప్రతీ సంవత్సరం ఏదో ఒక చోట ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది . తద్వారా ప్రభుత్వ పాలనకు కావచ్చు , పథకాల అమలుకు కావచ్చు అంతరాయం కలుగుతుందని మరియు ప్రజా ధనం వృధా అవుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది.

జమిలి ఎన్నికల తో లాభనష్టాలు పరిశీలిద్దాం…. నష్టాలు:
  1. ఎన్నికల నిర్వహణ మరియు ఫలితాల వెల్లడి ఆలస్యం కావచ్చు.
  2. ప్రాంతీయ సమస్య పై కాక జాతీయ సమస్య లే ఎక్కువగా చర్చకు రావచ్చు.
  3. ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వా లకు జాతీయ పార్టీల తో పోటీ పెను సవాలు గా మారవచ్చు.
  4. ఈ.వీ.ఎమ్ లు, ఇతర పరికరాలు అధిక సంఖ్యలో వినియోగించాలి వస్తుంది.
లాభాలు:
  1. దేశం వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు జరిగితే ప్రభుత్వ సమయం , ప్రజా సమయం వృధా కాక పోవటమే కాక పోలింగ్ శాతం కూడా పెరుగుతుంది.
  2. రాజకీయ పార్టీల కు ఎన్నికల వ్యూహాల రచన పై కాక ప్రజా ప్రయోజనకర పనులు పై దృష్టి పెడతారు.
  3. నల్లధనం తెల్ల గా మారే ప్రక్రియ ను అరికట్ట వచ్చు.ఎందుకంటే ఎన్నికల సమయంలో నల్లధన ప్రవాహం విపరీతంగా ఉంటుంది.
  4. విద్యాసంస్థల మరియు విద్యావేత్త ల సమయం మిగులుతుంది.
  5. ప్రతీ సారి జనాకర్షక పథకాలు ప్రవేశపెట్టటం నివారించవచ్చు.
  6. ఒకే ఎన్నికల కోడ్ వలన పథకాలకు ఆటంకం లేకుండా ఉంటుంది.
బిల్లు ఆమోదం పొందగలదా…

ఎలక్షన్ కమీషన్, లా కమీషన్ లు పలు సంవత్సరాలు గా జమిలి ఎన్నికలకు సిఫారసు చేసినా గత ప్రభుత్వాలు ఆసక్తి చూప లేదు. ప్రధాన మంత్రి మోడీ చొరవతో రామ్ నాథ కోవింద్ గారి అధ్యక్షతన సాధ్యాసాధ్యాల అంచనా కొరకు కమిటీ ని వేయడం జరిగింది. బిల్లు అమలుకు సగానికి పైగా రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం. సంఖ్యా పరంగా ఉభయసభల్లో కేంద్రం ప్రభుత్వానికి బలం సరిపోదు, ఇతరుల మద్దత్తు కావాల్సిందే . అవసరమైతే రాజ్యాంగ సవరణలు చేసైనా జమిలి బిల్లును జయప్రదం చేయాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తూ , అవినీతి రహిత ఎలక్షన్ జరగాలని పొలిటికల్ సారథి ఆకాంక్షిస్తుంది. పొలిటికల్ డిజటల్ మార్కెటింగ్ లో ఉత్తమ సాంకేతిక విలువలు పాటిస్తూ , అభ్యర్థుల ఉన్నతి కి కృషి చేస్తున్నది పొలిటికల్ సారథి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Need Help?